Health tips: నేరేడు పళ్లను పురుషులు తప్పకుండా తినాలి.. ఎందుకంటే స్పెర్మ్...
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత సీజన్ నేరేడు పళ్లు ఎక్కడా చూసినా దర్శనమిస్తుంటాయి. ఈ నేరేడు పళ్లను తింటే ఎన్నో ప్రయోజనాలను మన సొంతం చేసుకునే...Health Tips
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత సీజన్ లో నేరేడు పళ్లు ఎక్కడా చూసినా దర్శనమిస్తుంటాయి. ఈ నేరేడు పళ్లను తింటే ఎన్నో ప్రయోజనాలను మన సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు, ప్రముఖులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల శరీరానికి సంబంధించిన సమస్యలు, పొట్టకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి సహాయపడుతాయి. అంతేకాదు.. గుండె సంబంధిత సమస్యలు, మధుమేహ సమస్యతో బాధపడుతున్న వాళ్లు వీటిని తింటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ నేరేడు పళ్లను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంతమంచిదని, వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణమున్నందున వీటిని తీసుకుంటే ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పురుషులైతే వీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిదని చెబుతున్నారు. ఎందుకంటే నేరేడు పళ్లు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది కాబట్టి వైవాహిక జీవితం మెరుగుపడుతదని చెబుతున్నారు.