మైనింగ్ మాఫియా పై ఇంటెలిజెన్స్ ఆరా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని
దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లి గ్రామంలో గుట్టలు కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియా రాయుళ్ల పై ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం ఆరా తీశారు. వారం రోజుల పరిధిలో దిశ దినపత్రికలో ప్రచురితమవుతున్న కథనాలపై ఇంటెలిజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మందలపల్లి గ్రామంలో జెసీబీల సాయంతో గుట్టలను కొల్లగొట్టిన ప్రాంతాలను పరిశీలించి ఫోటోలు, వివరాలు సేకరించినట్లు తెలిసింది. మందలపల్లి గ్రామంలో ఉన్న గుట్టలను ఎవరు తొవ్వి తరలించకపోతున్నారు అనే విషయంపై లోతుగా విచారణ ప్రారంభించారు. మందలపల్లి మైనింగ్ మాఫియాపై ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరించడంపై మైనింగ్ మాఫియా రాయుళ్ల గుండెల్లో గుబులు మొదలైంది.