సీఎం కేసీఆర్కు వైద్యారోగ్యశాఖ అధికారుల ఝలక్..!
వైద్యారోగ్యశాఖలోని ఖాళీ పోస్టులన్నీ ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేసేలా కనిపిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలోని ఖాళీ పోస్టులన్నీ ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేసేలా కనిపిస్తున్నది. ఇక నుంచి రాష్ట్రంలో కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ విధానాలు ఎట్టి పరిస్థితుల్లోఉండవని స్వయంగా సీఎం కేసీఆర్అసెంబ్లీలో ప్రకటించారు. కానీ మళ్లీ పాత సీన్రిపీట్అవుతుంది. హెల్త్ డిపార్ట్ మెంట్లోని ఖాళీ సీట్లను నింపేందుకు కాంట్రాక్ట్ విధానంలో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. రెగ్యులర్రిక్రూట్మెంట్కంటే కాంట్రాక్ట్పోస్టులకే సర్కార్ మొగ్గు చూపుతున్నది. గాంధీ ఆసుపత్రిలో సివిల్అసిస్టెంట్సర్జన్లు, అసిస్టెంట్ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 135 పోస్టులను ఇదే విధానంలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వీటిలో జనరల్మెడిసిన్అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 20, జనరల్సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 20, అసిస్టెంట్ ప్రొఫెసర్ 20, అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ 20, అనస్థీషియా కు 20, మరో 20 సివిల్అసిస్టెంట్ సర్జన్లు కావాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
ఈ నెల 19వ తేదిన దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్11వ తేది మెరిట్లిట్ తయారు చేసిఎంపికైన వారికి 14వ తేదిన అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. అయితే కేవలం సంవత్సరం కాలం పాటు పనిచేయాలని ఆ తర్వాత గవర్నమెంట్దే తుది నిర్ణయంగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ప్రొఫెసర్లకు ప్రతీ నెల రూ. 1,25,000, సివిల్ అసిస్టెంట్సర్జన్లకు రూ. 52 వేలు చొప్పున వేతనాలు ఇవ్వనున్నారు.
రెగ్యులర్ పక్కకు....
సీఎం హామీ ఇచ్చినప్పటికీ వైద్యారోగ్యశాఖలోని ఖాళీలు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడంపై డాక్టర్లు మండిపడుతున్నారు. కొందరు ఆఫీసర్లకు సీఎం మాట అంటే లెక్క లేకుండా పోయిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తుంటే, మళ్లీ కాంట్రాక్ట్ విధానంలో పోస్టులు భర్తీ చేయడమేమిటనీ ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు కాంట్రాక్ట్ విధానంలోనే పనిచేసి ఆలసిపోయామని, వయస్సు మీరిపోతున్నా రెగ్యులర్రిక్రూట్మెంట్లు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ లెక్కన ఉద్యోగాల భర్తీపై ఈ సారి కూడా ఊహజనితమైన మాటలతో ప్రభుత్వం పబ్బం గడిపేలా ఉన్నదని వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.