ఆ పాఠశాలలో ఒక్కడే టీచర్.. మరి పిల్లల భవిష్యత్ ఏంటి?

దిశ అడ్డాకుల: కరోనా కారణంగా విద్యార్థులు - He is the only teacher in the primary school in Kanmanur village

Update: 2022-03-07 11:47 GMT

దిశ అడ్డాకుల: కరోనా కారణంగా విద్యార్థులు ఏడాదిన్నర పాటు పాఠశాలలకు దూరమై.. పుస్తకాలను పక్కన పెట్టి దీర్ఘకాలంపాటు ఇంటి దగ్గర కూర్చున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించడంతో పిల్లలు బడి బాట పట్టారు. అయితే అడ్డాకుల మండల పరిధిలోని కన్మనూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించగా.. ఒక్క కాంట్రాక్ట్ టీచర్ తో బడి పిల్లల చదువులను కొనసాగిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని మంచి సూక్తిని మట్టిపాలు పట్టిస్తున్నారు.


ఈ విషయం పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నియమించిన ఉపాధ్యాయులు నెలకు ఒకసారి వచ్చి ఉపాధ్యాయుల రిజిస్టర్‌లో హాజరు వేసుకొని విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వాళ్ల సొంత పనులను కొనసాగిస్తున్నారు. బోధించే ఉపాధ్యాయులు లేక పిల్లలు కాలక్షేపం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యను, మంచిని బోధించే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags:    

Similar News