దబాంగ్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న సల్మాన్?

Update: 2022-03-02 06:20 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి వార్త మీడియాకు ఎప్పుడూ హాట్ టాపికే. కానీ ఇప్పటికే హాఫ్ సెంచరీ క్రాస్ చేసిన సల్లూ భాయ్ మాత్రం బ్యాచిలర్ లైఫ్‌‌నే ఆస్వాదిస్తున్నాడు. గతంలో ఐశ్వర్య, కత్రినా వంటి కోస్టార్లతో ప్రేమాయణాలు నడిపిన కండల వీరుడు.. ఏ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. అయితే ప్రస్తుతం మాత్రం హీరోయిన్ సోనాక్షి సిన్హాతో సల్మాన్ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్ ఈ ఫొటోలో సోనాక్షి వేలికి రింగ్ తొడుగుతుండటం విశేషం. దీంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 2010లో సల్మాన్ 'దబాంగ్' మూవీతోనే సోనాక్షి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా.. అప్పటి నుంచి తనతో ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఇక ప్రస్తుత పిక్‌ను ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తుండగా.. సల్మాన్ ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నాడు.

Tags:    

Similar News