ట్రెండింగ్ టాక్‌: హ‌ల్దీరామ్స్ ప్యాకెట్‌పైన ఉర్ధూ మాట‌లు ఎందుకు రాశారు..?! (వీడియో)

వ్య‌వ‌స్థ‌ ఫెయిల్ అయితే ఫిఫ్త్ ఎస్టేట్ ఫైర్ అవుతుంది.Haldiram's Trends After TV Reporter Heckles Staff Over "Urdu" Text.

Update: 2022-04-06 13:06 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భార‌తదేశంలో మీడియా ప్ర‌భావం పీక్స్‌లో ఉంద‌న‌డానికి ఎలాంటి ఆలోచ‌నా అవ‌స‌రంలేదు. వ్య‌వ‌స్థ‌లు ఫెయిల్ అవుతున్నాయంటే ఫిఫ్త్ ఎస్టేట్ ఫైర్ అవుతుంది కూడా. అయితే, ఇక్క‌డ కాస్త ఓవ‌రాక్ష‌న్‌ ట్రెండ్ కూడా ఉందంటు విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. అది స‌రే, తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. ఈమ‌ధ్య ఇండియాలో హలాల్ మాంసం, హిజాబ్, అజాన్‌లపై అభ్యంతరాలు మిన్నంటుతున్న నేప‌ధ్యంలో ఓ టీవీ రిపోర్ట‌ర్ నొయిడాలోని ఒక‌ స్టోర్ మేనేజర్‌ని ఉద్దేశించి నానా ర‌చ్చ చేసింది. హల్దీరామ్ స్నాక్ ప్యాకెట్‌పై ఉర్దూ అక్ష‌రాలు ఎందుకున్నాయంటూ మండిపడింది. ఈ టీవీ రిపోర్టర్ వాద‌న‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మిగిలిన భాషల్లాగే, ఉర్థూను కూడా రాసారంతే కానీ మ‌రే ఉద్దేశం లేద‌నీ స్టోర్ మేనేజ‌ర్ ఎంత న‌చ్చ‌ చెబుతున్నా విన‌కుండా 'ఉర్థూ అక్ష‌రాలు ఎందుకున్నాయి, జంతువుల నూనె వాడారా..?' అంటూ ప్ర‌శ్నించింది. రిపోర్ట‌ర్ వైఖ‌రిపై స్పందించిన నెటిజ‌న్లు రైల్వే బోర్డుల‌పైనా, ఇండియ‌న్ క‌ర‌న్సీ పైన ఉన్న ఉర్ధూ అక్ష‌రాల‌ను చూపిస్తూ వీటిని కూడా బ్యాన్ చేయండంటూ చురక‌లు అంటిస్తున్నారు.

సుదర్శన్ హిందీ టీవీ ఛానెల్‌పై ఇస్లామోఫోబిక్ కంటెంట్ ప్ర‌సారం చేస్తుంద‌ని గతంలో సుప్రీం కోర్టు మొట్టికాయ‌లు కూడా వేసింది. "ప్రభుత్వ సేవలో ముస్లింలను చొప్పించే కుట్ర" వంటి విషయాలపై కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమతికి వ్య‌తిరేకంగా కోర్టు క‌లుగ‌జేసుకుంది. చివరికి టెలికాస్ట్ ఆపేశారు."సివిల్ సర్వీసెస్‌లో ముస్లింల చొరబాట్లంటూ సుదర్శన్ టీవీ షో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మోసపూరితమైన, ఆవేశపూరితమైన కంటెంట్ ఇవ్వ‌డం స‌మంజ‌సం కాదు" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ రెండేళ్ల క్రితం ఛానల్‌పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. "నేను ఒక ఎపిసోడ్‌ చూశాను. బాధ కలిగించింది. చాలా చిత్రాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని తీసివేయాలి" అని జస్టిస్ ఇందు మల్హోత్రా అన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..