Viral: స్కూల్ పిల్లలు తప్పిపోకుండా ఇలా చేయండి.. పోలీసుల వైరల్ ఐడియా!
పిల్లలు స్కూల్‌కి వెళ్లి వచ్చే వరకూ ఒకటే భయం. Gurugram Police Twitter advise for schools goes viral.
దిశ, వెబ్‌డెస్క్ః పిల్లలు స్కూల్‌కి వెళ్లి వచ్చే వరకూ ఒకటే భయం. వాళ్లు ఇంట్లో కనిపించలేదంటే గుండె దడ మొదలవుతుంది. అందుకే చిన్నపిల్లల్ని, ముఖ్యంగా స్కూల్ పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు తల్లిదండ్రులు. కానీ, అనుకోని పరిస్థితుల్లో పిల్లలు తప్పిపోవడం కూడా సంభవిస్తుంది. ఇలాంటి సంఘటనే గురుగ్రామ్‌లోనూ చోటుచేసుకుంది. గురుగ్రామ్ పోలీసుల అధికారిక ట్విట్టర్ పేజీలో, రాజీవ్ చౌక్ దగ్గర ఓ బాలుడు ఎలా దారి తప్పిపోయాడో అందరికీ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. బాలుడి గురించిన వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ట్వీట్ చేయాల్సి వచ్చింది. అయితే, ట్వీట్ కొద్ది సమయంలోనే వైరల్ అయ్యింది.
ట్వీట్‌లో ఉన్న సమాచారం బట్టి, "మొదటి రోజు పాఠశాలకు వెళ్లిన బాలుడు ఇంటికి వస్తున్న సమయంలో గందరగోళానికి గురై రాజీవ్ చౌక్ వద్ద తన పాఠశాల బస్సు నుండి పొరపాటున దిగాడు. ఏంచేయాలో తెలియక రోడ్డుపైన ఉన్న బాలుణ్ణి ట్రాఫిక్ పోలీసులు చూసి, అతడు తప్పిపోయి తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నట్లు గుర్తించారు. వెంటనే అతని స్కూలు ఐడీ కార్డు ద్వారా తల్లిదండ్రులను గుర్తించారు". ఇక, ఈ సంఘటన తర్వాత, వైరల్ అడ్వైజరీలో, గురుగ్రామ్ పోలీసులు విద్యార్థుల రవాణాకు సంబంధించి పాఠశాలలను మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. దీనిపై స్పందించి ఓ మహిళ, పిల్లల్ని స్కూల్‌కి పంపేటప్పుడు పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్లతో ఉన్న సమాచారాన్ని పిల్లల దగ్గర ఉంచాలని సలహా ఇచ్చారు.