వింత వాహనంపై వరుడి పెళ్లి ఊరేగింపు.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరి జీవితంలో కల్యాణం అత్యంత కీలక ఘట్టంగా పరిగణించబడుతుంది. అందుకే వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తుంటారు..Latest Telugu News

Update: 2022-06-20 07:01 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరి జీవితంలో కల్యాణం అత్యంత కీలక ఘట్టంగా పరిగణించబడుతుంది. అందుకే వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ అపురూప దృశ్యం కలకాలం గుర్తుండిపోయేలా యూనిక్ థాట్స్, అరేంజ్‌మెంట్స్‌తో బంధుమిత్రులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లి సంబరాల్లో వెలుగుచూస్తున్న విచిత్ర విన్యాసాలు ట్రెండ్ సృష్టించడం చూస్తున్నాం. ప్రస్తుతం ఓ వరుడు కూడా తన పెళ్లి ఊరేగింపును వింతగా ప్లాన్ చేయగా.. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మణ్‌పూర్-శంకర్‌పూర్ గ్రామంలో ఓ వరుడు తన వివాహ ఊరేగింపు వేడుకలకు కారుకు బదులుగా.. పూలతో అలంకరించిన బుల్డోజర్‌ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు 'బుల్డోజర్ బాబా కీ జై' అంటూ అతడు చేసిన నినాదాలు గ్రామ ప్రజలందరినీ ఆశ్చర్యపరచగా.. వారంతా ఆ బుల్డోజర్‌తో సెల్ఫీలు దిగేందుకు పరుగులు తీయడం విశేషం. కాగా ఆ ఆలోచన గురించి పంచుకున్న వరుడు.. 'నేను నా వివాహాన్ని ఒక చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకున్నా. ఈ ఆలోచన భిన్నంగా ఉండటంతో అదే ఫాలో అయ్యాను' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ బుల్డోజర్ ఫొటో వైరల్ అవుతోంది. 


Similar News