PM Modi: అవసరమున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అవసరమున్న ప్రతి ఒక్కరికి ఇంటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు.
న్యూఢిల్లీ: అవసరమున్న ప్రతి ఒక్కరికి ఇంటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా పౌరుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పేర్కొంది. మంగళవారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారుడికి మోడీ లేఖలో స్పందించారు. అంతకుముందు మధ్య ప్రదేశ్‌కు చెందిన సుధీర్ కుమార్ పేదలకు, ఇళ్లులేని వారికి ఈ పథకం వరం అని పేర్కొన్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. అద్దె ఇళ్లలో ఉంటున్న తనకు కేంద్రప్రభుత్వం వల్లె సొంత ఇంటి కల నేరవేరిందని తన ఆవేదనను లేఖలో చెప్పారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఇళ్లు అంటే ఇటుకలు, సిమెంట్ కాదని భావాలు ఆకాంక్షలతో ముడిపడి, రేపటికి విశ్వాసాన్ని ఇస్తాయని ప్రధాని అన్నారు. కోట్లకు పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా పక్కా ఇళ్లు పొందారని తెలియజేశారు. లబ్దిదారుల జీవితాల్లోని ఈ చిరస్మరణీయ క్షణాలు, దేశ సేవలో అవిశ్రాంతంగా, నిరంతరాయంగా పని చేయడానికి స్ఫూర్తిని, శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు.