Governor Tamilisai: గవర్నర్ తమిళిసైకి మరోసారి అవమానం..?
Governor Tamilisai Soundararajan Was Insulted Again| తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య మరోసారి ప్రోటోకాల్ అంశం హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి మరణ శిలా శాసనం
దిశ, వెబ్‌డెస్క్: Governor Tamilisai Soundararajan Was Insulted Again| తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య మరోసారి ప్రోటోకాల్ అంశం హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి మరణ శిలా శాసనం, కాంస్య విగ్రహం సందర్శనకు గవర్నర్ తమిళిసై వెళ్లారు. అయితే గవర్నర్ కు నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరీ స్వాగతం పలకాల్సి ఉన్నా .. వారు హాజరుకాకపోవడం చర్చకు దారితీస్తోంది. అయితే సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం గవర్నర్ కు స్వాగతం పలికినా.. ఆ వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన అధికారులు ఇలా ఎందుకు చేశారనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతోనే నల్గొండ కలెక్టర్, ఎస్పీలు గవర్నర్ కార్యక్రమానికి హాజరు కాలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తన పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళి సై గతంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. తన పర్యటనల్లో అధికారుల ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కంప్లైంట్ చేయగా.. ఈ వ్యవహారాన్ని అప్పట్లో కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. చాలా కాలంగా రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వైపు కన్నెత్తి చూడలేదు. కానీ గత జూన్ 28వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం మధ్య ఆప్యాయ పలకరింపు జరిగింది. ఇరువురు కలిసి ముచ్చటించుకోవడంతో రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ తొలగిపోయిందని అంతా భావించారు. కానీ తాజాగా నల్గొండలో గవర్నర్ పర్యటలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తడం చర్చనీయాంశం అవుతోంది
Also Read: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా