అధికారుల నిర్లక్ష్యానికి.. ప్రభుత్వ భూమి కబ్జా

Update: 2022-02-14 16:25 GMT

దిశ, మంచిర్యాల: ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ శివారు 42 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి అధికారుల నిర్లక్ష్యానికి మరో నిదర్శనంగా మారింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్జీవోస్ అధ్యక్షుడనంటూ.. తప్పుడు ప్రచారం చేసుకొని అప్పటి పాలనాధికారిణి తప్పు ద్రోవ పట్టించారని ఆధారాలతో కోర్టు బట్టబయలు చేసింది.

గతంలో సర్వే 42 భూమిని అప్పటి ప్రభుత్వం దళితులకు రైతులకు ఇచ్చింది. ఆ భూమిలో రైతులు వ్యవసాయం, కొంత మంది వ్యాపారం చేసుకున్నప్పటికీ కొందరు అధికారులు సదరు అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్జీవోస్ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పొందినట్లు తెలుస్తోంది. 2004 లో సర్వే 42 భూమిని ఎన్జీవోస్ చదును చేయడం తో 1970 నుండి నివాసం ఉంటున్న స్థానికులు, రైతులు మంచిర్యాల కోర్టును ఆశ్రయించగా వారికి స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఎన్జీవోస్ వెనుకకు తగ్గింది.

2010 సంవత్సరం లో కోర్టు కేసు వివాదంలో ఉన్న భూమిని ఎన్జీవోస్ మళ్ళీ చదును చేయడానికి ప్రయత్నించగా నివాసం ఉంటున్న స్థానికులు అడ్డుకోగా అందులో ముగ్గురు కుటుంబసభ్యులు ఫారీద్, అబ్దుల్ సత్తార్, యసీన్ ల కుమారులపై అధికారులు తమ అధికార బలాన్ని చూపించి పోలీసులతో అక్రమ కేసులు బనాయించారని వాదనలు ఉన్నాయి.

2012 లో మంచిర్యాల జూనియర్ కోర్టు స్థానికులకు పర్మినెట్లీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వగా.. ఎన్జీవోస్, పై కోర్టును ఆశ్రయించగా ప్రిన్సిపాల్ కోర్టు సరైన ఆధారాలు లేకపోవడంతో, కోర్టును తప్పుద్రోవ పట్టించడాని తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి 10 వేల జరిమానా విధించింది. అయినప్పటికి ఎన్జీవోస్ తీరు మారకుండా మళ్ళీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టు తీర్పును దిక్కరిస్తూ, అడిగే అధికారులు లేరని ఇష్టారాజ్యంగా ఇండ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.

ముగ్గురు అధికారులతో స్థానిక నాయుడితో చేతులు కలిసి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మున్సిపాలిటీ నుండి నిర్మాణ అనుమతులు లేకుండా ఒక్కొక్కరూ మూడు, నాలుగు వందల గజాలలో ఇండ్ల నిర్మాణం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికార నాయకులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై స్పందించిన టీఎన్జీవో వారితో త్వరలోనే చర్చిస్తామని అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేదిలేదని  ఎమ్మార్వో జ్యోతి పేర్కొన్నారు.

Tags:    

Similar News