ప్రభుత్వ హామీలు అన్ని మోసపూరితం: వివేక్ వెంకటస్వామి
దిశ ,క్యాతన్ పల్లి: గని ప్రమాదంలో గాయపడి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను latest telugu news..
దిశ ,క్యాతన్ పల్లి: గని ప్రమాదంలో గాయపడి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను బుధవారం మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. గద్దరేగడిలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు పార్టీలో చేరిన కార్యకర్తలకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని మోసపూరిత వాగ్దానాలు అని కేసీఆర్ ప్రభుత్వంపై ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మధుసూదన్,జిల్లా కార్యదర్శి సాగరిక, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి అందుగుల శ్రీనివాస్, రమేష్, మోర్చా మండల నాయకులు పాల్గొన్నారు.