ఫుడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హోటల్స్, రెస్టారెంట్లకు షాక్
హోటల్, రెస్టారెంట్ బిల్లులో సర్వీస్ ఛార్జీతోపాటు ఇతర ఏ పేర్లతో కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేయకూడదని సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో : హోటల్, రెస్టారెంట్ బిల్లులో సర్వీస్ ఛార్జీతోపాటు ఇతర ఏ పేర్లతో కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేయకూడదని సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సోమవారం హోటళ్లు, రెస్టారెంట్‌లు బిల్లుల్లో విచ్చలవిడిగా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ వేయకుండా నివేదిక ఇచ్చింది. ఒక వేళ వీటిని ఏవైనా హోటల్/రెస్టారెంట్ ఉల్లంఘిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చని కస్టమర్లకు తెలిపింది.
పెరుగుతున్న ఫిర్యాదుల మేరకు, సీసీపీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా అన్యాయంగా డబ్బులు వసూలు చేయడం, బలవంతంగా కస్టమర్ల దగ్గర నుండి డబ్బులు రాబట్టడానికి చెక్ పెడుతూ మార్గదర్శకాలను జారీ చేసింది. సీసీపీఏ నోటీసుల ప్రకారం కస్టమర్లకు ముందుగా వివరణ ఇవ్వాలని, బిల్లులో ఎటువంటి అవకతవకలు జరిగినా ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఒకవేళ అదనంగా ఛార్జీలను వసూలు చేస్తే బిల్లు మొత్తం నుండి దానిని తీసివేయమని కస్టమర్ అభ్యర్థించవచ్చని తెలిపింది. కస్టమర్లు 1915కి కాల్ చేసి NCH మొబైల్ యాప్ లో కంప్లయింట్ ఇవ్వవచ్చని పేర్కొంది.