6వ త‌ర‌గ‌తి విద్యార్థికి గోల్డ్ మెడల్

Update: 2022-03-04 12:46 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి నిహాల్.. ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ నాలెడ్జ్ ఆర్గనైజేష‌న్ (ISKO) పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఫ‌స్ట్‌ సౌత్ ఇండియా ఆన్‌లైన్ E-KATA ఛాంపియన్‌షిప్-2022, వీఎన్‌ మార్టికల్ ఆర్ట్స్ అకాడమీతో కలిసి 6వ త‌ర‌గ‌తి కె. నిహాల్ బంగారు ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా నిహాల్‌ను స్కూల్ చైర్మన్ బిట్ల శ్రీ‌నివాస‌రెడ్డి ఘ‌నంగా స‌త్కరించి, అభినందించారు. త‌మ‌ విద్యార్థులు కేవ‌లం చ‌దువులోనే కాకుండా అన్ని రంగాల్లో ఎదిగేందుకు స్కూల్ యాజ‌మాన్యం కృషి చేస్తోంద‌ని, త‌మ పాఠ‌శాల‌కు వ‌రుస‌గా బంగారు ప‌త‌కాలు రావ‌డం గ‌ర్వకార‌ణంగా ఉంద‌న్నారు. నిహాల్ విజ‌యం గొప్పద‌ని, ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించి, బంగారు భ‌విష్యత్‌ను పొందాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎండీ సంగమేశ్వర గుప్తా, ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ రెడ్డి, కో- ఆర్డినేటర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News