ట్రావెల్స్ బస్సులో బంగారం.. 57 వజ్రాలు పట్టివేత!

Update: 2022-02-28 14:36 GMT

దిశ, ఉండవెల్లి: తెలంగాణ-ఆంధ్ర అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్నూలు పట్టణ సమీపంలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఏపీ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం తెల్లవారు జామున రూ.39.28లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సీఐ మంజుల తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఎన్ ఎల్ 01 బి 2048 నిదా ట్రావెల్ బస్సును తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న కపిల్ వద్ద ఉన్న బ్యాగులో ఎలాంటి ఆధార పత్రాలు లేని 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.39.28లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.తదుపరి విచారణ నిమిత్తం తాలూకా పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News