యాదాద్రిలో వైభవంగా మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలు
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రిలోని శ్రీ స్వామి వారి బాలాలయంలో - Glorious inaugurations at the Yadadri Temple
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రిలోని శ్రీ స్వామి వారి బాలాలయంలో నిత్యారాధనల అనంతరం.. శ్రీ స్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవం లో భాగంగా సోమవారం సాయంత్రం మృత్సంగ్రహణం వేడుకలు, అంకురారోపణం, యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన వేడుకలను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, ఆర్యక బృందం, పారాయణికులు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేకత..
పాలికలను (మట్టిపాత్రలను) విష్ణు గాయత్రీ మంత్రముచే శుద్ధి చేసి, వాటిలో మృత్తికను, ధాన్యములను పోసి నీటితో గడుపుతారు. తర్వాత సర్వాలంకృతములు గావింపబడి ఆ పాలికలను దేవతా స్వరూపములుగా అర్చించి ఆరాధించుట ఉత్సవములతో ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. విత్తనములు మంత్రోదకములచే పూజింపబడి మొలకెత్తింపబడుట లోక కల్యాణ కారకమని శాస్త్రోక్తం.