$100 బిలియన్ల మార్కులో అదానీ.. 3 నెలల్లో రూ. 1.57 లక్షల కోట్లు
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఓడరేవులు, గనులు, గ్రీన్ ఎనర్జీ తో కూడిన వ్యాపారాలను కలిగి ఉన్న అదానీ సంపద ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ. 1.57 లక్షల కోట్లు పెరిగిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. గత 3 నెలల్లో అదానీ సంపద ప్రపంచ ధనవంతులు అయినటువంటి ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్‌గేట్స్, వారన్ బఫెట్‌ల సంపద కంటే అధికమని నివేదిక తెలిపింది. మరోక భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంపద గడిచిన మూడు నెలల్లో 824 కోట్ల డాలర్లుగా ఉంది. గ్రీన్ ఎనర్జీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూప్‌లు స్టాక్ మార్కెట్‌లో 2020 నుండి 1,000% కంటే ఎక్కువ పెరిగాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ నివేదికలో ఇద్దరు మినహా మిగతా వారు అమెరికన్లే.