Yash "Toxic" : యష్ "టాక్సిక్"కు భారీ షాకిచ్చిన అటవీశాఖ

కేజీఎఫ్‌(KGF) స్టార్‌ 'యష్‌'(Yash) నటిస్తున్న చిత్రం 'టాక్సిక్‌'(Toxic). టాక్సిక్‌ మూవీ మోషన్‌ పోస్టర్‌ని గతేడాది డిసెంబర్‌ చివరివారంలో ప్రకటించారు.

Update: 2024-11-12 13:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేజీఎఫ్‌(KGF) స్టార్‌ 'యష్‌'(Yash) నటిస్తున్న చిత్రం 'టాక్సిక్‌'(Toxic). టాక్సిక్‌ మూవీ మోషన్‌ పోస్టర్‌ని గతేడాది డిసెంబర్‌ చివరివారంలో ప్రకటించారు. ఈ మోషన్‌ పోస్టర్‌లో యష్‌ కౌబాయ్‌ టోపీ ధరించి.. నోటిలో సిగరెట్.. భుజంపై తుపాకీతో కనిపించాడు. నయనతార(Nayanatara), బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌(Sharukh Khan) నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నది. 'టాక్సిక్‌' చిత్రం షూటింగ్ జరిగిన అటవీ ప్రదేశంలో భారీగా చెట్లు నరికేశారు అంటూ వచ్చిన వార్తలపై అటవీ-పర్యావరణ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే అదనపు ప్రధాన కార్యదర్శికి ఈ విషయంపై లేఖ రాశారు. చెట్లను నరకడం నిబంధనలు ఉల్లంఘించడమేననంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని సైతం పరిశీలించారు. అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం, అటవీ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు.

ఈ భూమి ప్రస్తుతం హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌(HMT) ఆధీనంలో ఉన్నది. వాస్తవానికి ఈ రిజర్వ్ ఫారెస్టు భూములను గెజిట్ నోటిఫికేషన్‌లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండానే హెచ్‌ఎంటీకి ఇచ్చారు. భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది. వ్యాపార అవసరాల కోసం హెచ్‌ఎంటీ భూమిని అద్దెకు ఇస్తుంది. ఈ క్రమంలోనే ‘టాక్సిక్’ మూవీ షూటింగ్‌ కోసం లీజుకు ఇచ్చారు. అయితే, మూవీ భారీ సెట్‌ కోసం అటవీ భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలున్నాయి. బెంగళూరులోని అటవీ భూమిలో చెట్లను అక్రమంగా నరికివేయడంపై కర్ణాటక అటవీశాఖ టాక్సిక్‌ మూవీ నిర్మాతలపై కేసు నమోదు చేసింది. అలాగే, కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌, హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ జనరల్‌ మేనేజర్‌పై సైతం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Tags:    

Similar News