Naga Chaitanya: అది మరపురాని క్షణాలతో నిండిన ప్రయాణం.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్’(Tandel). ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్’(Tandel). ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Arvind) సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన గత కొద్ది కాలంగా శోభిత(Shobhita Dhulipala)తో సీక్రెట్ డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని అందరికీ షాకిచ్చారు. అయితే త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయినట్లు శోభిత ఫొటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య మాత్రం ఏ విషయాలు తెలియజేయడం లేదు.
ఈ క్రమంలో.. తాజాగా, చైతు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024లో ఈ సీజన్ నాకు, మొత్తం జట్టుకు గ్రేట్, అభిరుచి. మరపురాని క్షణాలతో నిండిన ప్రయాణం. ఇప్పుడు F4 డ్రైవర్ టైటిల్ ఫైట్‌తో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఆ ఛాంపియన్‌షిప్ విజయాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉంది!’’ అనే క్యాప్షన్ జత చేసి రేసింగ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.
Read More..