2021-22 లో రూ. 30 లక్షల కోట్లను అధిగమించనున్న భారత ఎగుమతులు!

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు మార్చి 14 నాటికి దాదాపు 390 బిలియన్..telugu latest news

Update: 2022-03-17 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు మార్చి 14 నాటికి దాదాపు 390 బిలియన్ డాలర్ల(రూ. 29.6 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల(రూ. 30 లక్షల కోట్ల)ను అధిగమిస్తాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఎగుమతుల్లో ఆటో విడిభాగాల పరిశ్రమ మొదటిసారిగా 600 మిలియన్ డాలర్ల(రూ. 4,500 కోట్ల)ను వాణిజ్య మిగులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆటోమోటివ్ కాంపొనెంట్ పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పరిశ్రమ వర్గాలను కోరారు. అలాగే, ఆటో పరిశ్రమ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్‌డీ)పై దృష్టి సారించాలని, ముఖ్యంగా ఈ-మొబిలిటీలో ఎక్కువ పెట్టుబడుల అవసరం ఉందని, మెరుగైన పనితీరు ఉండే విధంగా అధిక ప్రమాణాలను కలిగి ఉండాలని ఆయన చెప్పారు. టాప్-50 గ్లోబల్ ఆటోమోటివ్ సప్లయర్స్ క్లబ్‌లో ఐదు భారతీయ కంపెనీలు ఉండాలని ఆశిస్తున్నానన్నారు.

Tags:    

Similar News