Priyanka Gandhi: వయనాడ్‌‌లో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ.. ఎన్ని వేల ఓట్ల లీడ్ అంటే?

వయనాడ్ (Wayanad) ఎంపీ ఉప ఎన్నిక ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Update: 2024-11-23 03:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: వయనాడ్ (Wayanad) ఎంపీ ఉప ఎన్నిక ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్ (Wayanad), రాయ్‌బరేలి (Raibareli) నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీ చేసి అఖండ విజయం సాధించారు. అయితే, ఏదైనా ఒకే స్థానం నుంచి ఎంపీగా కొనసాగాల్సి ఉన్నందున ఆయన వయనాడ్ (Wayanad) స్థానాన్ని వదులుకున్నారు. దీంతో అక్కడ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అక్కడి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మొదటిసారి ప్రతక్ష్య ఎన్నికల బరిలోకి దిగారు.

ఈ క్రమంలోనే వయనాడ్ (Wayanad) ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై తొలి రౌండ్ ఫలితం కూడా వచ్చేసింది. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తన సమీప బీజేపీ అభ్యర్థి అయిన నవ్య హరిదాస్‌ (Navya Haridas)పై 53 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ (Postal Ballot)లో కూడా ఆమె 460 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. చివరి రౌండ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) పార్లమెంట్‌ (Parliament)లో అడుగుపెట్టడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నాయి. 

Tags:    

Similar News