ట్విట్టర్ చనిపోతుంది?.. ఎలన్ మస్క్ ట్వీట్ వైరల్
దిశ, ఫీచర్స్ : ట్విట్టర్ చనిపోతుందా? ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
దిశ, ఫీచర్స్ : ట్విట్టర్ చనిపోతుందా? ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎందుకంటే ఇలా ప్రశ్నించింది సాధారణ వ్యక్తి కాదు.. స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా మోటార్స్ సీఈవో ఎలన్ మస్క్. ఈ మధ్యే ట్విట్టర్ షేర్ హోల్డర్‌గా చేరిన ఆయన.. ప్రపంచంలోనే ఎక్కువ మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన టాప్ 10 పర్సన్స్ జాబితాపై వెటకారాన్ని ఈ విధంగా ప్రదర్శించాడు. ఈ లిస్ట్‌లో 131.4 M ఫాలోవర్స్‌తో బరాక్ ఒబామా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, సెకండ్ ప్లేస్‌లో జస్టిన్ బీబర్ ఉన్నాడు. ఇక తొమ్మిదో స్థానం నరేంద్ర మోడీ కొట్టేయగా.. టెన్త్ ర్యాంక్ ఎలన్ మస్క్‌దే కావడం విశేషం.
అయితే ఈ టాప్ 10 మెంబర్స్ ఏడాదికి ఒక్కసారైనా ట్వీట్ చేస్తారో లేదో.. అసలు పోస్ట్‌లే చేయనివారికి మొదటి స్థానం కట్టబెట్టడం విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశాడు ఎలన్. ఒకవేళ వారు ట్వీట్ చేసినా.. చాలా తక్కువ కంటెంట్ ఉంటుందని, తద్వారా ట్విట్టర్ చనిపోయే ప్రమాదముందని కామెంట్ చేశాడు. అయితే అతడి ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. 9% వాటాతో ట్విట్టర్ బిజినెస్ గ్రూప్స్‌లో ఎంటరైన ఎలన్, ఇలాంటి కామెంట్స్‌తో షేర్స్ పడిపోయేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత మొత్తంగా వశపరుచుకుంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే న్యూ ప్లాట్‌ఫామ్ లేదా న్యూ ఫీచర్స్‌తో వస్తాడా? ఆయన ప్లాన్ ఏంటో? అంతుచిక్కడం లేదని చర్చించుకుంటున్నారు.