2 గంటల చార్జింగ్‌తో 200 కి.మీ.. సరి కొత్త ఎలక్ట్రిక్ బైక్
దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ..telugu latest news
దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంపెనీలు కూడా పోటీ పడి మరి మార్కెట్లోకి కొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీసంస్థ ఒబెన్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్-ఓబెన్ రోర్‌ను ఇండియాలో ప్రవేశపెట్టింది. ఇది డిజైన్ పరంగా హోండా CB300Rని పోలి ఉంటుంది.
బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్, రైడ్ గురించి ముఖ్యమైన వివరాలను అందిస్తుంది. బ్యాటరీ, ఇంజిన్ IP65 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఒబెన్ రోర్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 10 kW ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కి.మీల రేంజ్‌ను ఈ బైక్ ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. కేవలం రెండు గంటల వ్యవధిలో మోటార్‌సైకిల్‌ను చార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
బైక్ మూడు మోడ్‌లు.. ఎకో, సిటీ, హవోక్. ఎకో మోడ్ 150 కి.మీ (గరిష్ట వేగం 50 కి.మీ) పరిధిని అందిస్తుంది. హవోక్ మోడ్ 100 కి.మీ (గరిష్ట వేగం 100 కి.మీ.). సిటీ మోడ్ 120 కి.మీ. ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డిస్క్ బ్రేక్‌లతో పాటు బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను అందిస్తుంది. ఒబెన్ రోర్ ప్రారంభ ధర రూ. 99,999. బుకింగ్ ధర రూ. 999 కంటే తక్కువగా ఉంది. ఇది ఇప్పటికే మార్చి 18, 2022 నుంచి ప్రారంభించబడింది.