Actress Kasturi: నటి కస్తూరికి బిగ్ రిలీఫ్..

నటి కస్తూరికి భారీ ఊరట లభించింది. ఆమెకు ఎగ్మూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-11-21 03:26 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో అరెస్టై.. చెన్నై జైల్లో ఉన్న నటి కస్తూరికి (Actress Kasturi) భారీ ఊరట లభించింది. ఎగ్మూర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అనంతరం.. ఆదివారం ఆమెను ఎగ్మూర్ కోర్టులో(Egmore Court) హాజరు పరచగా.. 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకూ రిమాండ్ (Kasturi Remand) ఇవ్వడంతో.. పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

అయితే.. తాను సింగిల్ మదర్ ని అని, తనకు స్పెషల్ చైల్డ్ ఉందని.. ఆ చిన్నారి బాగోగుల్ని తానే చూసుకోవాలని కోర్టుకు విన్నవిస్తూ.. బెయిల్ కోరగా.. కోర్టు కస్తూరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపురం మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళులుగా చెప్పుకుంటున్నారని వ్యాఖ్యలు చేసింది. దీనిపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెన్నైలో కేసులు పెట్టడంతో.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 29న ఆమెను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News