Breaking News : చైనా కంపెనీలకు షాకిచ్చిన భారత్
నాణ్యత లేని పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న రెండు చైనా కంపెనీల(China Compenies)పై భారత్(Bharath) కఠిన చర్యలు చేపట్టింది.
దిశ, వెబ్ డెస్క్ : నాణ్యత లేని పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న రెండు చైనా కంపెనీల(China Compenies)పై భారత్(Bharath) కఠిన చర్యలు చేపట్టింది. లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్న రెండు ప్రధాన కంపెనీలను రద్దు చేయగా.. మూడో కంపెనీపై విచారణ జరుపుతున్నది. ఇటీవల చైనా నుంచి దిగుమతి అవుతున్న నాసిరకం పవర్ బ్యాంక్‌ల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న అనేక పవర్ బ్యాంకులు.. కంపెనీ క్లెయిమ్ చేసిన సామర్థ్యంలో కేవలం 50-60శాతంతో మాత్రమే పని చేస్తున్నాయి. భారతీయ కంపెనీలు ఈ తక్కువ నాణ్యత బ్యాటరీలను చౌక ధరలకు కొనుగోలు చేసి.. మార్కెట్లు ఉత్పత్తులను చౌకగా విక్రయిస్తున్నాయి. ఇది మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని ప్రభావితం చేయడంతో పాటు భద్రత, పనితీరు విషయంలో కస్టమర్స్‌ని తప్పుదారి పట్టిస్తున్నది. ఈ నెల ప్రారంభంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) భారతదేశంలో ఉపయోగించే 50శాతం కంటే ఎక్కువ లిథియం బ్యాటరీలను సరఫరా చేసిన రెండు చైనీస్ బ్యాటరీ సరఫరాదారుల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసింది. గ్వాంగ్‌డాంగ్ క్వాసన్ న్యూ ఎనర్జీ టెక్నాలజీ, గన్‌జౌ నావెల్ బ్యాటరీ టెక్నాలజీ లైసెన్స్‌లను రద్దు చేయగా.. గన్‌జౌ టావోయువాన్ న్యూ ఎనర్జీ విచారణ జరుపుతున్నది.