పరీక్షల రీషెడ్యూల్.. కొత్త డేట్స్ ప్రకటించిన బోర్డ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్​ పాఠశాల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను విద్యాశాఖ.. Latest Telugu News..

Update: 2022-03-31 17:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్​ పాఠశాల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను విద్యాశాఖ రీషెడ్యూల్​ చేసింది. తొలుత ఏప్రిల్​ 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించాలని ఎస్​సీఈఆర్టీ భావించింది. అయితే ఆ తేదీలను మారుస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఏప్రిల్​ 16వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్​ 22వ తేదీ వరకు ఎగ్జామ్స్​ కొనసాగనున్నాయి. కాగా 23వ తేదీ నాటికి రిజల్ట్స్​ను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగ్​ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

అదే రోజున చివరి వర్కింగ్​ డేగా పేర్కొంది. అయితే చివరి పరీక్ష 22న ముగిస్తే 23వ తేదీనే రిజల్ట్​ ఇవ్వాల్సి ఉంది. ఒక్క రోజు మాత్రమే గ్యాప్​ ఉండటంతో టీచర్లకు ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా అకడమిక్​ క్యాలెండర్​ ప్రకారం అంటే ఏప్రిల్​ 24 నుంచి విద్యార్థులకు సెలవులు ఇవ్వనుంది. తిరిగి జూన్​ 12వ తేదీన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉండగా 10వ తరగతి విద్యార్థులకు యథావిధిగా క్లాసులు, రివిజన్​ కొనసాగనుంది. వారికి మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News