డ్రగ్స్ ఎఫెక్ట్ : రాడిసన్హోటల్లైసెన్స్ రద్దు
రాడిసన్ హోటల్‌లోని పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్‌పార్టీ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాడిసన్ హోటల్‌లోని పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్‌పార్టీ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించింది. ఈ హోటల్‌కు చెందిన బార్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అదేవిధంగా పబ్నుకూడా రద్దు చేసింది. పబ్, లిక్కర్ రెండు లైసెన్స్‌లు రద్దు చేసినట్లు ఆబ్కారీ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బంజారా హిల్స్ పరిధిలో ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగిస్తున్న రాడిసన్ హోటల్ పైఅంతస్తులో ఉన్న పబ్‌లో డ్రగ్స్ లభించిన సంగతి తెలిసిందే. ఈ పబ్‌పై పోలీసుల దాడి చేసిన కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో పలువురు ప్రముఖుల బంధువుల పేర్లు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుని, ఆబ్కారీ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో రాడిసన్ లైసెన్స్‌లు రద్దు చేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.