Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం.. దేశ ప్రజలకు కీలక హామీ

Draupadi Murmu Takes Oath as 15th President Of India| భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి

Update: 2022-07-25 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: Draupadi Murmu Takes Oath as 15th President Of India| భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి గిరిజన మహిళగా, అలాగే తక్కువ వయస్సులో రాష్ట్రపతిగా ఎన్నికై ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఒక ఆదివాసీ మహిళను అయిన నాకు ఇంత గొప్పఅవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను దేశ అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుదకు ధన్యవాదాలు చెప్పారు. తనపై నమ్మకం పెట్టిన దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తన రాజకీయ జీవితం మొదలైందని గుర్తుచేసుకున్నారు. 75 ఏళ్ల ఉత్సవాల వేళ భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సింగరేణి చరిత్రలో తొలిసారి.. కేంద్ర ప్రభుత్వమే సూత్రధారి..!!


Tags:    

Similar News