Director Maruthi: రిస్క్ అని చెప్పినప్పటికీ ఈ సినిమా తీశారు.. ‘బార్బరిక్’పై డైరెక్టర్ మారుతి కామెంట్స్
స్టార్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బార్బరిక్’ (Barbaric).
దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బార్బరిక్’ (Barbaric). సత్యరాజ్ (Satyaraj), వశిష్ట ఎన్ సింహ (Vasishta N Simha), సాంచి రాయ్ (Sanchi Roy), ఉదయ భాను (Udaya Bhanu), సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై డైరెక్టర్ మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమాపై పాజిటివ్ అంచనాలు క్రియేట్ కాగా.. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి.. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగిన ఈ టీజర్‌లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి.
ఇక టీజర్ రిలీజ్ అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా కోసం నేనేమీ పని చేయలేదు. ఈ టీంకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. మోహన్, రాజేష్ చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీని అందరూ ఎంకరేజ్ చేయాలి’ అని తెలిపారు.