ప్రధానికి చరిత్ర అర్థం కాలేదు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

Update: 2022-02-11 11:55 GMT

పనాజీ: ప్రధాని మోడీకి చరిత్ర సరిగ్గా అర్థం కాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన పరిణామాలు, పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. శుక్రవారం మార్గోవ్‌లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ప్రధాని రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన పరిస్థితులను అర్థం చేసుకోలేదు. ఆయన చరిత్రను అర్థం చేసుకోలేకపోయారు. గోవా ప్రజలను ప్రస్తుత సమస్యలైనా పర్యావరణం, నిరుద్యోగం నుంచి మళ్లించడానికే ఇక్కడికి వచ్చారు' అని అన్నారు. హిజాబ్ వివాదంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. గోవా ప్రజలను తప్పుదోవ పట్టించే అంశాలపై ఆయన జోక్యం చేసుకోనని చెప్పారు. గోవా ప్రజలకు ఏం ముఖ్యమో దానిపై దృష్టి పెట్టడమే తన ప్రాధాన్యత అని తెలిపారు. మరో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీతో విజయం సాధిస్తుందని చెప్పారు. అంతకుముందు గురువారం పనాజీ ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నెహ్రూ తలచుకుంటే గోవాలో 1947లోనే స్వాతంత్రం వచ్చేదని అన్నారు. 40 స్థానాలున్న గోవాలో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News