Toilet paper: టాయిలెట్‌ పేపర్‌ వాడితే క్యాన్సర్‌ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

అంతర్గత శరీర భాగాలను క్లీన్ చేసుకోవడం కోసం ఈ పేపర్‌ను వాడుతుంటారు

Update: 2024-11-23 03:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎంతో మంది వాష్‌రూమ్‌లో వ్యక్తిగత శుభ్రత కోసం టాయిలెట్ పేపర్‌ను (Toilet paper ) తీసుకువెళ్తుంటారు. అంతర్గత శరీర భాగాలను క్లీన్ చేసుకోవడం కోసం ఈ పేపర్‌ను వాడుతుంటారు. కానీ, ఇది మంచిదికాదని అంటున్నారు. టాయిలెట్ పేపర్ అంటువ్యాధి  ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా, తొడల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ అయ్యేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, టాయిలెట్‌లో పేపర్‌ వాడితే క్యాన్సర్‌ వస్తుందో.. లేదనేది ఇక్కడ తెలుసుకుందాం..

టాయిలెట్ పేపర్ ను ఎక్కువగా వాడటం వలన వల్ల అంతర్గత భాగాలు ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. ఇది మాత్రమే కాకుండా, ప్రైవేట్ పార్ట్‌లో దురద వస్తుంది. ఎందుకంటే, వీటిలో ఇతర పెర్ఫ్యూమ్‌లు కూడా ఉంటాయి.

టాయిలెట్ పేపర్ ను వాడినప్పుడు చర్మంపై రుద్దకూడదు. అప్పుడు ఆ భాగం నల్లబడుతుంది. అంతే కాకుండా, దీనిలో ఫార్మాల్డిహైడ్ అనే ఆర్గానిక్ ఉంటుంది. దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు వెల్లడించారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News