సమంత, ప్రభాస్ కలిసి ఇప్పటివరకు ఎందుకు నటించలేదో తెలుసా..? వీరిద్దరి కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన తన కెరీర్‌లో ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించాడు.

Update: 2024-10-24 08:57 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన తన కెరీర్‌లో ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించాడు. ఇక సమంత కూడా ప్రభాస్‌లాగే పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ చిత్ర భాషల్లోని పలువురు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే వీరిద్దరూ దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ, ఈ ఇద్దరు ఇప్పటి వరకు కలిసి సినిమాల్లో నటించలేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే..

బేసిక్‌గా ప్రభాస్, సమంత కలిసి నటించాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన పోవడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ హైట్. అవును, ప్రభాస్ 6 అడుగులు ఉంటే, సమంత హైట్ 5.2 అడుగులు. ఈ కారణంగానే వీరిద్దరితో కలిసి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా 'సాహో' చిత్రంలో సమంతనే కథానాయికగా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ చాన్స్ బాలీవుడ్‌కి చెందిన శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News