Eyes Care Tips: ఐ సైట్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కంటిచూపు ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు.

Update: 2024-10-20 15:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది కంటిచూపు ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. దీనికి కారణం జీవన శైలిలో మార్పులే కారణమని చెప్పుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు కూడా ఓ కారణమే. ఇక ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దలు ఫోన్లకు బానిసవుతోన్న విషయం తెలిసిందే. డే అండ్ నైట్ మొబైల్స్‌లోనే మునిగితేలుతున్నారు. తిండి లేకున్నా ఉంటున్నారు కానీ ఒక్క నిమిషం ఫోన్ లేకపోతే శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారు. ప్రజెంట్ అలాంటి పరిస్థితులే వచ్చాయి. కాగా ముఖ్యంగా పిల్లల కళ్లకే కాదు.. బ్రెయిన్ పై కూడా ప్రభావం చూపిస్తుందని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.

ముఖ్యంగా కళ్లు బలహీనపడటానికి మెయిన్ రీజన్ చెడు జీవనశైలి. అలాగే ఆహారపు అలవాట్లు కూడా. అయితే కంటిచూపును మెరుగుపర్చుకోవాలంటే మీ దినచర్య, అలవాట్లలో పలు మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

20-20-20 నియమం పాటించండి..

ప్రతి 20 నిమిషాలకొకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల డిస్టెన్స్ లో ఉన్న ఏదైనా వస్తువును చూడండి. దీంతో కళ్లకు విశ్రాంతిగా ఉంటుంది. అలాగే ప్రతిరోజూ 8గంటలు తప్పక నిద్రపోండి. అలాగే నాణ్యత గల ఫుడ్ తీసుకోవాలి. గింజలు, పండ్లు, ఆకుకూరలు, విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలు ఉన్న ఆహారాలు కంటిచూపును మెరుగుపరుస్తాయి.

తగినంత వాటర్ తాగాలి..

ప్రతిరోజూ తప్పకుండా శరీరానికి అవసరమైనంత వాటర్ తాగాలి. లేకపోతే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాగా కళ్లను హైడ్రేట్ గా ఉంచడానికి వాటర్ తప్పక తాగాలి. దీంతో కంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి.

స్క్రీన్ చూసే సమయంలో విరామం అవసరం..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కంప్యూటర్ల ముందే పని చేస్తున్నారు.దీంతో సైట్ వస్తుంది. కాగా కంప్యూటర్ స్క్రీన్ కు కనీసం 25 అంగుళాల దూరంలో ఉండి వర్క్ చేయండి. వర్క్ చేసే సమయంలో బ్రేక్ తీసుకుంటే కళ్లకు ఎలాంటి సమస్యలు రావు. మసక వెలుతురులో చదవకండి. దీంతో కళ్లపై ఒత్తిడి పడుతుంది. సన్ గ్లాసెస్ వాడండి. ఇవి యూవీ కిరణాల నుంచి కాపాడుతాయి.

ఏడాదికి ఒకసారి కళ్లు చెకప్ చేసుకోండి..

సంవత్సరానికి ఒకసారి అయినా కళ్లు చెకప్ చేయించుకోండి. కంటి కండరాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే కంటి వ్యాయామాలు చేయాలి. ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూడొద్దు. అదే పనిగా పుస్తకాలు చదవడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడుతుంది.

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..?

కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే బచ్చలికూర, క్యారెట్, క్యాప్సికం, గుడ్లు, ఆరెంట్, బాదం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ల ప్రాబ్లమ్స్ ఉన్నా నయమవుతాయి. కంటి సమస్యలు వస్తే మాత్రం ఈ ఆహారాలు తీసుకుంటూ వైద్యుల్ని తప్పక సంప్రదించాలి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News