Dharmesh: ‘ఆ సీన్ కోసం మూడ్రోజులు షూట్.. ఏకంగా 47 రీటేక్స్.. చిత్ర దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్
అప్పట్లో బాలీవుడ్ ప్రేమకథా చిత్రాలంటే చాలా మంది ఇష్టపడేవారు.
దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో బాలీవుడ్ ప్రేమకథా చిత్రాలంటే చాలా మంది ఇష్టపడేవారు. అనేక లవ్ స్టోరీలు ప్రేక్షకుల ముందుకొచ్చి.. సినీ ప్రియుల మది దోచుకున్నాయనడంలో అతిశయోక్తిలేదు. అలాంటి సినిమాల్లో రాజా హిందూస్తానీ మూవీ ఒకటి. ధర్మేష్ దర్శన్(Dharmesh Darshan) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్(Aamir Khan) అండ్ కరిష్మా కపూర్(Karisma Kapoor) జోడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ మూవీ బాక్సాఫసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. 1996 లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు ధర్మేష్ దర్శన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చాడు.
అప్పట్లో రాజా హిందూస్తానీ సినిమాను సినీ ప్రేక్షకులు ఎంతో ఆదరించారని డైరెక్టర్ ధర్మేష్ అన్నారు. కేవలం నటనతోనే కాకుండా మ్యూజిక్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించిందని వెల్లడించారు. అలాగే కథానాయిక కరిష్మా గురించి మాట్లాడుతూ.. తను నాకు నచ్చిన విధంగా నటించేదని చెప్పారు. ఆ నటి చాలా యాక్టివ్ పర్సన్ అని.. ఆమెతో పనిచేసిన రోజుల్ని అస్సలు మర్చిపోను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలో ముద్దు సన్నివేశం షూట్ చేయాల్సి ఉందని.. కానీ తను అప్పటివరకు ఏ మూవీలోను కిస్ సన్నివేశం చేయలేదని అన్నాడు.
స్టార్టింగ్ చెప్పినప్పుడు తను చాలా కంగారు పడిందని తెలిపారు. ఇందుకోసం కరిష్మా మదర్ ను సెట్‌కు పిలిపించి.. ధైర్యం చెప్పించామని తెలిపారు. తర్వాత మూడ్రోజులు ముద్దు సీన్ చిత్రీకరించామని అన్నారు. ఈ షూట్ అయిపోయేవరకు కరిష్మా తల్లి సెట్లోనే ఉందని పేర్కొన్నాడు. ఈ సీన్ కోసం ఏకంగా 47 రీటేక్స్ తీసుకున్నట్లు తెలిపాడు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక అది ఐకానిక్ ముద్దు సన్నివేశం అయ్యిందని వివరించాడు. కిస్ సీన్ పై కరిష్మా.. ఈ సన్నివేశంలో నటించినప్పుడు అసౌకర్యంగా ఫీల్ అయ్యానని తెలిపింది. ఎప్పుడెప్పుడు షూట్ కంప్లీట్ అవుతుందని భావించానని గతంలో వెల్లడించింది.