రేవంత్‌ను పార్టీలోకి నేనే తీసుకువచ్చా..?
ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పార్టీలోకి తానే తీసుకువచ్చానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పార్టీలోకి తానే తీసుకువచ్చానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆ పార్టీ లెజెస్లేటీవ్కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. రేవంత్తనతో బాగానే ఉంటాడన్నారు. ఇప్పటి వరకు ఆయన వల్ల ఇబ్బంది రాలేదన్నారు. తనపై దుష్ఫ్రాచారాలు చేయడం తగదన్నారు. తాను కాంగ్రెస్పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక వేళ పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేసేస్తానని నొక్కి చెప్పారు.
మరోవైపు అసెంబ్లీ సభలో సోమవారం జరిగిన దానికి చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. తమ సీఎల్పీ నేత భట్టి గట్టిగా నిలబడి ఉండాల్సిందన్నారు. ఇద్దరు మాట్లాడింది తప్పు అనడం విచిత్రంగా ఉన్నదన్నారు. కానీ నా మాటలను మాత్రమే రికార్డుల నుంచి తొలగించారన్నారు. సభలో తన కోసం సభ్యుల మద్ధతు లభించలేదన్నారు. భట్టికి ప్రతీ విషయంలో అండగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం మమ్మల్ని వదిలేశారని వాపోయారు. టీఆర్ఎస్ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడితే తాను రెస్పాన్స్ కావాల్సిన అవసరం లేదన్నారు. ఆయన తన స్థాయికి సరిపోడని తీసివేశారు. కాంగ్రెస్అధిష్టానం నిర్ణయాల వలనే కొన్ని సార్లు సైలెంట్‌గా ఉండాల్సి వస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడమే తన లక్ష్యమన్నారు. జనం కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేయాలని కోరారు.
కాంగ్రెస్ ఆ బాధ్యత గట్టిగా తీసుకుంటే కాంగ్రెస్‌లోనే నిలబడి కొట్లాడుతానని హామీ ఇచ్చారు. ఏకంగా పది మంది ఎమ్మెల్యేలను తన తరఫున గెలిపిస్తానని చెప్పారు. ఏ కాజ్ కోసం పోరాటం చేశామో, తెలంగాణలో ఇప్పటికీ నెరవేరకపోవడం బాధకరమన్నారు. అప్పట్లో ఆంధ్రోళ్లు దోచుకొన్నారని రెచ్చగొట్టి ఇప్పుడు ప్లేట్ పిరాయిస్తూ టీఆర్ఎస్పార్టీ తూచ్ అంటుందన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతా అని హామీ ఇచ్చి ఇప్పుడు మాట దాటవేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్నదని, గ్రామాల్లో ఇప్పటికీ కేడర్ సూపర్ గా పనిచేస్తున్నట్లు వివరించారు. అందరి లీడర్లు కలిసి కట్టుగా పని చేస్తే అధికారంలోకి తప్పకుండా వస్తామని వివరించారు. పాదయాత్రలు ఎవరి నియోజకవర్గంలో వాళ్లు చేసుకుంటే సరిపోతుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తే మాత్రం స్వాగతిస్తానని స్పష్టం చేశారు.