ఢిల్లీలో భారీ దుమ్ము తుఫాను.. నెట్టింట్లో వీడియోల వ‌ర్షం!

ఢిల్లీ న‌గ‌రం ఇప్ప‌టికే ప‌లు స‌వాళ్ల‌ను ఎదుర్కుంటుంది. Scary videos show massive dust storm in Noida.

Update: 2022-04-26 09:10 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భార‌త రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రం ఇప్ప‌టికే ప‌లు స‌వాళ్ల‌ను ఎదుర్కుంటుంది. ప్ర‌పంచంలోని కాలుష్య న‌గ‌రాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీని తాజాగా దుమ్ము తుఫాను చుట్టిముట్టింది. వ‌ర్షాకాలంలో వ‌ర‌ద‌ల‌తో అల్ల‌ల్లాడిన రాజ‌ధాని న‌గ‌రం ఇప్పుడు విప‌రీత‌మైన వేడి గాలులతో భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తుంది. ఏప్రిల్ 25న తీవ్రమైన‌ దుమ్ము తుఫాను, బలమైన గాలులు దేశ రాజధానిని తాకడంతో ఢిల్లీ వాతావరణంలో పెను మార్పు సంభ‌వించింది. కొంత స‌మ‌యం పాటు నిరంత‌రంగా వేడి గాలులు ముంచేసిన‌ తర్వాత ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో సాయంత్రం భారీ దుమ్ము తుఫాను వ‌చ్చింది. ఈ ప‌రిణామంతో ఢిల్లీ జ‌నాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. భ‌యంక‌ర‌మైన‌ వాతావ‌ర‌ణాన్ని వీడియోలు తీసి, ఇంట‌ర్నెట్‌లో పెట్టారు. చిన్నపాటి వర్షాలు, భారీ గాలులతో కూడిన ఈ వీడియోలు నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. ఇక‌, ఏప్రిల్ 28 నుండి మే 1వ తారీఖు వరకు తీవ్ర వేడిగాలులు వీస్తాయని ఇప్ప‌టికే వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 25న ఢిల్లీ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా న‌మోదవ‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.


Similar News