నువ్వు బ్లాక్ చేస్తావా?.. నేను బ్లాక్ చేయనా? : దీప్తి సునయన వార్నింగ్
దిశ, సినిమా : దీప్తి సునయన.. సోషల్ మీడియా సర్కిళ్లలో ఈ పేరు తెలియని వారుండరు. అందం, చలాకీతనంతో హ్యూజ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ బబ్లీ గర్ల్.. పలు చిన్న సినిమాల్లో కూడా నటించింది..Latest Telugu News
దిశ, సినిమా : దీప్తి సునయన.. సోషల్ మీడియా సర్కిళ్లలో ఈ పేరు తెలియని వారుండరు. అందం, చలాకీతనంతో హ్యూజ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ బబ్లీ గర్ల్.. పలు చిన్న సినిమాల్లో కూడా నటించింది. ఇక వెబ్ సిరీస్‌లతో ఫేమ్ సంపాదించుకున్న షణ్ముఖ్‌తో నాలుగైదేళ్లు సాఫీగా సాగిన ఈమె ప్రేమకథకు బిగ్‌బాస్ సీజన్ 5 ద్వారా ఎండ్ కార్డ్ పడింది. ఈ సీజన్‌లో షణ్ముఖ్, సిరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ కావడాన్ని తట్టుకోలేని దీప్తి.. షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఇదిలా ఉంటే.. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో సరదాగా ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. బేసిక్‌గా తనకు కోపం రాదు కానీ చిరాకు వస్తుందని, అందుకే తన పేరును చిరాకేశ్వరిగా మార్చుకుంటే బెటర్ అనిపిస్తోందని వెల్లడించింది.
ఇక తనకు ఇష్టమైన పేరేంటని అడిగితే మేఘన అని చెపింది. ఈ సంభాషణ అప్పటి వరకు సరదాగా సాగినప్పటికీ.. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం సునయన చాలా సీరియస్ అయ్యింది. 'ఉదయాన్నే పనికిమాలినవన్నీ సోషల్ మీడియాలో పెడతావు. వాటిని అస్సలు చూడలేకపోతున్నాం' అనడంతో దీప్తి వెంటనే రియాక్ట్ అయింది. అతడికి 'ముందు నన్ను బ్లాక్ చేస్తావా? నేను నిన్ను బ్లాక్ చేయనా?' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.