చనిపోయిన షార్క్‌లో సరికొత్త రోగం.. ఇదే మొదటి కేస్ అన్న వైద్యులు

దిశ, వెబ్‌డెస్క్: శాస్త్రవేత్తలు మరో కొత్త రోగాన్ని గుర్తించారు. దీనిని ఓ చనిపోయిన షార్క్‌ చేపలో గుర్తించారు. షార్క్‌కు పోస్ట్ మార్టం చేయగా

Update: 2022-04-09 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: శాస్త్రవేత్తలు మరో కొత్త రోగాన్ని గుర్తించారు. దీనిని ఓ చనిపోయిన షార్క్‌ చేపలో గుర్తించారు. షార్క్‌కు పోస్ట్ మార్టం చేయగా ఈ విషయం బయటపడింది. అయితే యూకేలోని కార్న్‌వాల్ బీచ్‌కు ఇటీవల ఓ గ్రీన్ ల్యాండ్‌లో ఉండే అరుదైన జాతి షార్క్ డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. అటుగా వెళ్తున్న కొందరు దాన్ని చూసి అధికారులకు తెలిపారు. దాంతో అధికారులు ఆ షార్క్‌కు పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులోనే ఆ షార్క్‌కు 'మెనింజైటిస్' అనే వ్యాధి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోనే ఇది తొలి కేసు అని వారు అన్నారు. ఈ షార్క్‌కు దాదాపు 100 సంవత్సరాలు ఉంటాయని వారు నిర్ధారించారు. షార్క్ మెదడు రంగు మారడంతో పాటు పూర్తిగా చెడిపోయిందని, షార్క్ చేప తలలోని బ్రెయిన్ ఫ్లూయిడ్ అంతా కూడా పొగమంచు మాదిరిగా మారిపోయిందని వైద్యులు వెల్లడించారు.

Tags:    

Similar News