ఎనిమిది నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం!

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరిలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత..telugu latest news

Update: 2022-03-14 16:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరిలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 6.07 శాతానికి చేరుకుంది. అంతకుముందు జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.01 శాతంగా ఉన్నట్టు గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో సీపీఐ సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన ద్రవ్యోల్బణ స్థాయిని (4 శాతానికి 2 శాతం అటు ఇటు) మించి వరుసగా రెండో నెల నమోదు కావడం గమనార్హం. ప్రతికూల బేస్ ఎఫెక్ట్ నెమ్మదించినప్పటికీ ఆహారేతర వస్తువుల్లో ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.89 శాతంగా నమోదైంది. అంతకుముందు జనవరిలో ఆహార పదార్థాల ధరలు 5.43 శాతం పెరిగాయి. మాంసం, చేపలు 5.47 శాతం నుంచి 7.45 శాతానికి, కూరగాయలు 5.19 శాతం నుంచి 6.13 శాతానికి పుంజుకున్నాయి. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 9.32 శాతం 8.73 శాతానికి, నూనెలు, కొవ్వుల విభాగ రిటైల్‌ ద్రవ్యోల్బణం 18.7 శాతం నుంచి 16.44 శాతానికి క్షీణించాయి. పప్పులు 3.02 శాతం, దుస్తులు, పాదరక్షలు 8.86 శాతంగా నమోదయ్యాయి.

Tags:    

Similar News