దేశంలోనే మొట్టమొదటి మెడికల్ సిటీ రానుంది: డిప్యూటీ సీఎం
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే మొట్టమొదటి మెడికల్ సిటీ దాదాపు 300 ఎకరాల్లో రానుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం.. Latest Telugu News..
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే మొట్టమొదటి మెడికల్ సిటీ దాదాపు 300 ఎకరాల్లో రానుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఆయన ఈ విషయం తెలిపారు. ఈ మెడికల్ సిటీకి 'ఇంద్రాయని మెడిసిటీ' అని పేరు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మెడిసిటీ పూణె రూరల్‌లో నిర్మించనున్నామని, ఇందులో ఒకే చోట అన్ని రకాల నాణ్యమైన చికిత్సలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మెడిసిటీలో దాదాపు 24 వేరువేరు ఆసుపత్రి భవనాలు ఉంటాయని ఆయన అన్నారు. అయితే ఈ మెడిసిటీ నిర్మించేందుకు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడుల రావాలని ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన తెలిపారు.