మరో రెండేళ్లలో పెట్రోల్ కార్ల కు సమానంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు: నితిన్ గడ్కరీ!
ఢిల్లీ: టెక్నాలజీ, గ్రీన్ ఫ్యూయెల్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం తో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు latest telugu news..
ఢిల్లీ: టెక్నాలజీ, గ్రీన్ ఫ్యూయెల్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం తో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ధరలు భారీగా తగ్గుతాయని కేంద్ర రోడ్లు రహదారుల మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ అన్నారు. మరో రెండేళ్లలో ఈవీ ల ధరలు పెట్రో, డీజిల్ వాహనాల ధరలకు సమానంగా ఉంటాయని తెలిపారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ ఇంధనానికి మారాలన్నారు. దీనివల్ల కాలుష్య తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలందరూ హైడ్రోజన్ టెక్నాలజీతో ప్రయాణించే వాహనాలకు వినియోగించాలని కోరారు.
మురుగు నీటిని గ్రీన్ హైడ్రోజన్‌గా ఉత్పత్తి చేయడానికి తమ జిల్లాల్లో చొరవ తీసుకోవాలన్నారు. హైడ్రోజన్ త్వరలో చౌకైన ఇంధన ప్రత్యామ్నాయంగా మారుతుందని పేర్కొన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ ధరలు తగ్గుతాయని, జింక్-అయాన్, అల్యూమినియం-అయాన్, సోడియం-అయాన్ బ్యాటరీ తయారీ కోసం మెరుగైన పరిశోధనలు జరుగుతున్నాయని గడ్కరీ వివరించారు. పెట్రోల్ కోసం ప్రస్తుతం రూ. 100 ఖర్చు చేసేవారు ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ. 10 మాత్రమే చెల్లించే సమయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.