Suriya : థియేటర్ల వివాదం.. సూర్యను ప్రశ్నించిన కన్నడ జర్నలిస్ట్.. ఏమన్నాడంటే..?
మన తెలుగు సినిమాలకు మాత్రం కొంచం కూడా అవకాశం ఇవ్వడం లేదు
దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదనే వివాదం రోజు రోజుకు పెద్దదవుతుంది. మనం తమిళ్ వాళ్ళకు కాదు, లేదు అని కాకుండా థియేటర్లు ఇస్తూ వాళ్ళు తీసిన సినిమాలను హిట్ అయ్యేలా చేస్తున్నాము . కానీ, మన తెలుగు సినిమాలకు మాత్రం కొంచం కూడా అవకాశం ఇవ్వడం లేదు. కిరణ్ సబ్బవరం (Kiran Abbavaram) " క " మూవీకి కనీసం 5 థియేటర్లు అడిగినా ఇవ్వలేదు.
గత కొన్ని రోజులుగా ఈ వివాదం సాగుతుంది. అయితే, ప్రస్తుతం సూర్య (Suriya) " కంగువ" (Kanguva) ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లారు. అక్కడ సినీ జర్నలిస్ట్ లతో ముచ్చటించారు.
ఈ నేపథ్యంలో ఓ కన్నడ జర్నలిస్ట్.. మా దగ్గర మీ సినిమాలకు వందల స్క్రీన్స్ ఇస్తున్నారు. మీ తమిళనాడులో మాత్రం థియేటర్స్ ఇవ్వడం లేదు.. మరి, త్వరలో రానున్న ఓ హీరో మూవీ పేరు చెప్పి థియేటర్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. మొదట షాక్ అయి ఆ తర్వాత దీనికి సమాధానమిస్తూ.. " నేను డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్ లో లేను. ఒకవేళ నన్ను ఈ మీటింగ్ కి పిలిస్తే నేను కచ్చితంగా దీని గురించి మాట్లాడతాను. నా వంతు సాయం చేస్తాను కానీ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అది వేరే ప్రపంచం, థియేటర్స్ ఓనర్స్ చూసుకుంటారని " అన్నాడు.