ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్, టీఆర్ఎస్ ట్విట్టర్ వార్
దిశ, వెబ్ డెస్క్: ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో latest telugu news..
దిశ, వెబ్ డెస్క్: ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ.. రైతుల తమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. అంటు ట్వీట్ చేశారు. దీనీకి కౌంటర్ గా ఎమ్మెల్సీ కవిత @rahulgandi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు. ధాన్యం కొనుగోలుకు సంభందించి పంజాబ్, హర్యానా, రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రతి రోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారు.
మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా ఎల్ లోకి వచ్చి నిరసన తెలియజేయండి. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. అంటూ. రాహుల్ గాంధికి కౌంటర్ ఇచ్చింది. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి.. కవిత గారు.. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టు లో ఒప్పందం పై సంతకం చేసి తెలంగాణ రైతలు మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా..? అని ప్రశ్నించారు.