Bigg Boss-8: బిగ్‌బాస్ హౌస్‌లో స్టార్ట్ అయిన మత పిచ్చి.. అసలు రంగు ఇదే అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss-8) సక్సెస్ ఫుల్‌గా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-10-16 09:51 GMT

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss-8) సక్సెస్ ఫుల్‌గా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి ఎంట్రీ (entry) ఇచ్చింది. ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో హౌస్‌లో డబుల్ ఎంటర్‌టైన్మెంట్ వస్తుంది. అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌ను రాయల్ టీమ్‌ (Royal Team)గా, ముందు నుంచి ఉన్న కంటెస్టెంట్స్‌ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (Original Gangsters)గా రెండు టీమ్‌ల కింద డివైడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు టీమ్‌ల మధ్య పోటీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ (Interesting)గా సాగుతోంది. ఇక గత వారం సీత ఎలిమినేట్ (Eliminate) కాగా.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎంతో రసవత్తరంగా సాగింది. ఏకంగా సోమ, మంగళవారం రెండు రోజులు ఈ నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. ప్రేరణ, హరితేజ, నిఖిల్, పృథ్వీ, యష్మి, గౌతమ్, తేజ, నబీల్, నాగ మణికంఠ నామినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ నామినేషన్స్ నుంచి ఎవరు సేవ్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్తారు అని ప్రతి కంటెస్టెంట్స్‌లో టెన్షన్ స్టార్ట్ అయింది.

ఇందులో భాగంగా మెహబూబ్, నబీల్ ఇద్దరు మాట్లాడుకున్న ఓ వీడియో (video) ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు మెహబూబ్ (Mehboob) నబీల్ (Nabil) తో మాట్లాడుతూ.. ‘మనకు కమ్యూనిటీ (Community) ఉంది. మనకు కమ్యూనిటీ (Community) ఓట్లు దారుణంగా పడతాయి.. అయితే మనం ఇద్దరం ఒకేసారి నామినేషన్స్‌లో లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. మనం ఇద్దరం ఒకేసారి నామినేషన్స్‌లో ఉంటే కమ్యూనిటీ (Community) ఓట్లు డివైడ్ అవుతాయి’ అంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇన్నీ సీజన్‌లలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ (Bigg Boss) హౌస్‌లో కమ్యూనిటీ (Community) ఓట్లు గురించి మాట్లాడుకోవడంతో.. ప్రజెంట్ ఈ వీడియో (video) సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీంతో ‘ఇదే వీళ్ల అసలు రంగు’ అంటూ తిట్టుపోస్తున్నారు నెటిజన్లు.


Similar News