Pulse Rate: పల్స్ రేట్ ఎక్కువైతే ఎలాంటి వ్యాధులు తలెత్తుతాయి..!!

ఎవరైనా ముందుగా ఆస్పిటల్‌కు వెళ్లగానే డాక్టర్లు పల్స్ రేటు చెక్ చేస్తారు.

Update: 2024-10-16 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైనా ముందుగా ఆస్పిటల్‌కు వెళ్లగానే డాక్టర్లు పల్స్ రేటు చెక్ చేస్తారు. పల్స్ రేటు నార్మల్ కంటే ఎక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే పల్స్ రేట్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా చెబుతుంది. వేలికి చిన్న పరికరాన్ని పెట్టి పల్స్ రేట్ ఎంత ఉందో వైద్యులు చెక్ చేస్తారు. ఇదే అన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తికి ఎంత పల్స్ రేట్ ఉండాలి..? ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.

ఏ వయస్సు వారికి ఎంత పల్స్ రేట్ ఉండాలి..?

సాధారణంగా ఒక వ్యక్తికి పల్స్ రేట్ 60 నుంచి 100 బీట్ల వరకు ఉండాలి. క్రీడాకారుల పల్స్ రేటు అయితే ఒక్కోసారి 60 కంటే తక్కువగానే ఉంటుంది. వయస్సును బట్టి పల్స్ రేట్ ఎంత ఉండాలంటే..? నవజాత శిశువుకు 70 నుంచి 190, 11 నెలల పిల్లలు 70 నుంచి 160 వరకు, 10 ఏళ్ల పిల్లలకు 70 నుంచి 120 వరకు, 11 నుంచి 17 సంవత్సరాల వారికి 60 నుంచి 100 బీట్ల వరకు, పెద్దల్లో 60 నుంచి 100 వరకు పల్స్ రేట్ ఉండాలి.

తలెత్తే సమస్యలు...?

పల్స్ రేటు అసాధారణంగా ఉంటే గుండెపోటు వస్తుంది. ఛాతీ నొప్పి, గుండెలో దడ, కాంతిని చూడలేకపోవడం, బలహీనంగా అనిపించడం,జ్జాపకశక్తి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాగా ఇలాంటి లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News