స్టడీ సర్కిల్ ,గ్రంధాలయ సంస్థలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాతృత్వం

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమటోగ్రఫీ శాఖామంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-16 14:09 GMT

దిశ,నల్లగొండ: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమటోగ్రఫీ శాఖామంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా గ్రంధాలయ సంస్థ,జిల్లా పరిషత్ స్టడీ సర్కిల్ లో చదువుకుంటూ విద్యార్థుల కోరిక మేరకు.. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.1.65 లక్షల విలువగల పుస్తకాలని జెడ్పి స్టడీ సర్కిల్ ,గ్రంధాలయ సంస్థకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని.. కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జెడ్పి సీఈఓ నంద్యాల ప్రేమ్ కరణ్ కుమార్ రెడ్డి, స్థానిక గ్రంధాలయ లైబ్రేరియన్ బాలెమ్మలకు మంత్రి సూచించారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే విలువైన పుస్థకాలను అందచేసిన మంత్రికి జెడ్పి సీఈఓ, గ్రంధాలయ లైబ్రేరియన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈఓ ఎం.వి గోనా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,కొలనుపాక రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Similar News