శ్రీరామ నవమి సంబరాల్లో అపశ్రుతి.. 144 సెక్షన్ అమలు

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి పండుగను దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకున్నారు. దేశంలోని రామ మందిరాల్లో సీతారామ కళ్యాణం

Update: 2022-04-11 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి పండుగను దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకున్నారు. దేశంలోని రామ మందిరాల్లో సీతారామ కళ్యాణం అట్టహాసంగా జరిగింది. గుజరాత్‌లో జరుపుకున్న శ్రీరామనవమి సంబరాల్లో అపశ్రుతి ఏర్పడింది. రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రామనామాలతో ప్రతిధ్వనించిన వీధులు ఒక్కసారిగా మత ఘర్షణలతో నిండిపోయాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే పోలీసులు స్పందించి రెండు వర్గాల వారిని అడ్డుకున్నారు. ఈ ఘర్షణల్లో దాదాపు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ ఆనంద్ జిల్లాలోని ఖంబత్ ప్రాంతంలో మత ఘర్షణలు ఏర్పడ్డాయి. శ్రీరామనవమి సంబరాలు ఘనంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గొడవలు ప్రారంభమయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే ఘర్షణలకు అసలు కారణం ఎవరన్నది ఇంకా తెలియలేదని, ఇప్పటికే 9 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్ 13 వరకు ఆ ప్రాంతమంతటా సెక్షన్ 144 అమలు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News