అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు ఇకపై కామన్ ఎంట్రెన్స్
నేషనల్: కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నింట్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షను (సీయుఈటి) నేషనల్ టెస్టింగ్ latest telugu news..
నేషనల్: కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నింట్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షను (సీయుఈటి) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది. జాతీయ పరీక్షా సంస్థ సిద్ధం చేసిన మెరిట్ లిస్ట్ ప్రకారమే ప్రతి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం నుంచి విద్యార్థులను చేర్చుకుంటుందని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. దేశంలోని 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియ ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.
ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభకు ఇకపై వెయిటేజ్ ఇవ్వబోమని, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టులో వచ్చే ఫలితాలను బట్టి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని యూజీసీ చైర్మన్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులు అర్హత ప్రాతిపదికగా మాత్రమే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉపయోగించవచ్చని తెలిపారు. ఇకపై సెంట్రల్ వర్సిటీలో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సిలింగ్ ఉండదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రూపొందించిన మెరిట్ జాబితా ప్రాతిపదికనే విద్యార్థులను ప్రతి యూనివర్సిటీ చేర్చుకుంటుందని తెలిపారు. జామియా మిలియా ఇస్లామియా, ఆలిఘర్ యూనివర్సిటీ తో సహా అన్ని యూనివర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష తప్పనిసరని, యూజీసీ చైర్మన్ తెలిపారు.