టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు.. తహసీల్దార్‌ను విధుల నుంచి తప్పించిన కలెక్టర్

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు.

Update: 2022-03-25 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ విప్ అనుచరుల ఒత్తిడి ఒకవైపు, విప్ రేగా కాంతారావు మరోవైపు ఒత్తిడి చేస్తుండటంతో ఎవరికి ఏం చెప్పాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడి భరించలేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ చంద్రశేఖర్‌ రెడ్డి మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని విధుల నుంచి తప్పించారు. చంద్రశేఖర్ రెడ్డి స్థానంలో బూర్గంపాడు తహసీల్దార్ నాగిరెడ్డి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ ఘటనపై జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా అవాక్కయ్యారు. అధికార పార్టీ నేతల అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడికి తోడు ఎమ్మెల్యే నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే, దీనిని ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని స్థానిక ప్రభుత్వ అధికారులంతా బెంబేలెత్తిపోతున్నారు.

Tags:    

Similar News