చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్ చేసిన సీఎం కేసీఆర్.. వారి కోసమేనా..?

ఉగాది తర్వాత ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లున్నట్లు సమాచారం.

Update: 2022-03-31 16:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఉగాది తర్వాత ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లున్నట్లు సమాచారం. బుధవారం ఢిల్లీకి సీఎం వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదాపడింది. మళ్లీ గురువారం వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభతో కలిసి వెళ్తున్నారని అందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. అయితే హస్తినాకు ఉగాది ముందు హడావిడిగా వెళ్లడం ఎందుకు అని భావించి వాయిదావేసుకున్నట్లు సమాచారం.

ఉగాది వేడుకలను కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రభుత్వం ప్రగతి భవన్ లో అధికారికంగా నిర్వహించినా నిబంధనల మేరకు చేశారు. కొంతమందికే పరిమితం అయ్యేది. ఈ సారి కరోనా తగ్గడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులంతా పాల్గొనేలా ఇప్పటికే సీఎస్ ఆహ్వానం పలికారు. ఈ వేడుకల సమయంలో ఉండి అందరి మధ్య జరుపుకోవాలని కేసీఆర్ భావించినట్లు సమాచారం. అందుకే వైద్య పరీక్షల కోసం ఢిల్లీ హడావిడిగా ఎందుకని భావించిన కేసీఆర్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఉగాది తర్వాత వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News